Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 21 December 2023, 2:08 pmEditor : Sira News

Fire Accident: గుడిహత్నూర్ లో షార్ట్ సర్క్యూట్

సిరా న్యూస్, గుడిహత్నూర్:

గుడిహత్నూర్ లో షార్ట్ సర్క్యూట్
+డోంగర్ గావ్ లో ఇల్లు దగ్ధం
+ సుమారు రూ. 7లక్షల ఆస్తి నష్టం
+ అన్ని కోల్పోయి వీధిన పడ్డ సుధాకర్ కుటుంబం


ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్ గావ్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో దోమకొండ సుధాకర్ అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా దగ్దం అయ్యింది. గురువారం ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ఫ్రీజ్ లోంచి మంటలు రావడంతో, కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో, ఇరుగుపొరుగు వాళ్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు నలువైపుల వ్యాపించడంతో, ఇంట్లో ఉన్న సామాగ్రి, బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ. 7 లక్షలకు పైగా ఆస్తి నష్టం జర్గినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, ఇంటిని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. మంటల్లో సర్వస్వం కాలి బూడిద అయిపోవడంతో సుధాకర్ కుటుంబం కట్టు బట్టలతో వీధిన పడింది. అధికారులు తమను ఆదుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. అతను సైతం ముందుకొచ్చి తమ వంతుగా సహకార అందించాలని వేడుకుంటున్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.