Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 3 December 2023, 4:42 pmEditor : Sira News

సమస్యాత్మక గ్రామాలపై ప్రధాన దృష్టి పెట్టండి– జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్

పుట్లూరు, యల్లనూరు పోలీసు స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
అనంతపురం
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు కృషి చేయాలని సూచనలు

సిరా న్యూస్,
సమస్యాత్మక, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రధాన దృష్టిసారించి గట్టిగా పని చేయాలని  జిల్లా ఎస్పీ  కేకేఎన్ అన్బురాజన్  ఆదేశించారు. జిల్లాలోని పుట్లూరు, యల్లనూరు పోలీసు స్టేషన్ లను శనివారం జిల్లా ఎస్పీ  ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ ల పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ మరియు రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు. రిసెప్సన్ సెంటర్, లాకప్ గదులను పరిశీలించారు. ఈ రెండు పోలీసు స్టేషన్ల పరిధిలోని ఫ్యాక్షన్ ప్రభావిత/ సమస్యాత్మక గ్రామాలలోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాలలో అశాంతి, అలజడులు, సమస్యలకు కారణమయ్యే వారిపై నిరంతర నిఘా వేయాలన్నారు. గట్టిగా పని చేయాలన్నారు.  విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే ప్రతీ రికార్డును సమీక్షించారు. కేసులు త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు. దొంగతనాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.