
గిట్టుబాటు ధరల కోసం.. ఆందోళన
సిరా న్యూస్,మహబూబ్ నగర్; గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతుల కోపం కట్టలు తెంచుకుంది. వ్యాపారుల మోసాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. అచ్చంపేట మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై రైతులు దాడికి పాల్పడ్డారు.గిట్టుబాటు ధర కోసం వేరుశనగ రైతులు రోడ్డెక్కారు. అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అధికారులు, దళారులు కుమ్మక్కై గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని ఆగ్రహించారు. దీంతో మార్కెట్ యార్డుల వద్ద నిరసన చేస్తున్నారు. గత ఆదివారం నాగర్ కర్నూలు జిల్లాలో వేరు శనగ రైతులు ఆందోళన చేశారు. అచ్చంపేట మార్కెట్ యార్డుకు పెద్ద సంఖ్యలో వేరు శనగ రైతులు చేరుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఉద్రిక్తత దారితీసింది. మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై రైతులు దాడికి దిగారు. మార్కెట్ కమిటీ ఆఫీసులో ఫర్నీచర్ ధ్వంసం…
