
నాలుగో ఎమ్మెల్యే…
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారులో ఉక్కపోత తట్టుకోలేక హస్తం గూటికి చేరుకుంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలైన ఈ పర్వం తాజాగా మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మరోసారి ఈ అంశం తెరమీదకు వచ్చింది.పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర ఈ ఉదయం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 20 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దీంతో ఎవరెవరు హస్తం గూటికి చేరుకుంటారనే చర్చ మొదలైంది.ఇదిలా ఉండగా ఈ ఉదయం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వైపుల నుంచి…
