
Free Wi-Fi in 16 areas……16 ప్రాంతాల్లో ఫ్రీ వైఫై…
సిరా న్యూస్,హైదరాబాద్; ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర. నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ జాతరకు దేశ, విదేశాల నుంచి దాదాపు కోటి మంది వరకు భక్తుల వరకు వస్తారని అంచనా.ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో ముఖ్యం కానున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ నుంచి ఇంటర్నెట్, వైఫై సేవలు చాలా కీలకం కాగా.. సరైన సిగ్నలింగ్ వ్యవస్థ లేక అక్కడికి వెళ్లే భక్తులకు తరచూ ఇబ్బందులు తలెత్తుతుంటాయి.దీంతో ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మేడారం మహాజాతరలో మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలందించేందుకు కసరత్తు చేస్తోంది.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే 16 ప్రధాన ప్రాంతాల్లో అక్కడి…
