ఆంధ్రప్రదేశ్

విజయవాడ నుంచి జెడ్డాకు…

సిరా న్యూస్,విజయవాడ; ఆంధ్రప్రదేశ్ నుండి 2024లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమశాఖ, హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లను చేపట్టింది.కేసరపల్లి గ్రామంలోని ఈద్గా మసీదు ప్రాంగణంలో యాత్రికులకు బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మైనారిటీ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు జారీ చేసింది.హజ్ క్యాంప్ ను విజయవంతం చేయటానికి అవసరమైన అన్నిరకాల చర్యలు చేపట్టినట్టు వివరించారు. హజ్ యాత్రికులు యాత్రను సౌకర్యవంతంగా చేయడానికి అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారులు యాత్రికులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను…

Read More
25 May 2024, 11:09 amsiranews.in