
పదవుల భర్తీలో ఆలస్యంతో నైరాశ్యం
సిరా న్యూస్,హైదరాబాద్; పదేళ్లు పోరాడం. పొద్దున లేస్తే రోడ్డు మీదే ఉన్నాం. ఇప్పుడు పార్టీ పవర్‌లోకి వచ్చింది న్యాయం జరుగుతుందని అనుకున్నాం. ఏడాది అవుతుంది. ఇప్పటివరకు ఓ గుర్తింపు లేదు. పదవి లేదు. అంటూ గునుక్కుంటున్నారట కాంగ్రెస్ నేతలు. ఇంకో నెల అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను కూడా మొత్తం భర్తీ చేయలేదు. ఇలా పదవుల భర్తీలో ఆలస్యం అవుతుండటంతో నేతల్లో నైరాశ్యం కనిపిస్తోందట. పార్టీ కోసం ఎంత మొత్తుకుని ఏం లాభం అంటూ నింటూర్పుతో ఉన్నారు కొందరు నేతలు.రోజులు గడుస్తున్నా పదవుల భర్తీకి సర్కారు పెద్దలు పచ్చజెండా ఊపకపోవడంతో లీడర్లు ఢీలా పడుతున్నారు. పూర్తిస్థాయి క్యాబినెట్ విస్తరణపై చాలాసార్లు కసరత్తు చేసినా..ముందడుగు పడటం లేదు. సీఎంతో సహా 11మంది మంత్రులతోనే ఇప్పుడు…
