
2024 కొత్త సంవత్సరంలో భవిష్యత్తు ప్రజా ఉద్యమాలదే.
చెప్పులు కుడుతూ తమ నిరసన తెలిపిన కార్మికులు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనన్న బద్వేలు; కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7రోజులో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద చెప్పులు కుడుతూ తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనన్న మాట్లాడుతూ.... ఆనాడు మున్సిపల్ కార్మికులను పొగడ్తలతో ముంచేత్తిన పాలకులు నేడు వారిపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని,పారిశుధ్య కార్మికులకు లక్ష రూపాయలు జీతం ఇచ్చిన తక్కువేనని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు నేడు వేతనాల పెంపుపై పెదవి విరచడం శోచనీయమని, సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని కోర్టులు తీర్పునిచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కార్మికుల అంటే లెక్కలేదు…
