
గద్వాల జేజేమ్మకేనా…
సిరా న్యూస్,మహబూబ్ నగర్; తెలంగాణలో 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ .కీలకమైన మహబూబ్ నగర్ ఎంపీ సీటును పెండింగ్ లో పెట్టడానికి కారణాలు ఏంటి ? మాజీ మంత్రి డీకే అరుణ కు సీటు గ్యారెంటీ అనుకుంటున్న తరుణంలో...ఆమె పేరు ఎందుకు ప్రకటించలేదు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు కోసం ఇద్దరు పోటీ పడటమే కారణమా ? లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న చర్చ తెలంగాణలో జరుగుతోంది. బీజేపీ తరపున ఎంపీ సీటును ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. జితేందర్ రెడ్డి ఒకసారి బీజేపీ తరపున, మరోసారి బీఆర్ఎస్ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. అందుకే ఇపుడు ఆయన అదే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.…
