
అసంతృప్తా…గొంతెమ్మ కోరికలా
సిరా న్యూస్,మహబూబ్ నగర్; బీఆర్ఎస్ పార్టీ ఘర్‌వాపసీ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇస్తూ అందులో చేరిన తమ ఎమ్మెల్యేలను తిరిగి వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే గులాబీ గూటికి వస్తారని బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే తాను బీర్ఎస్‌లోకి వచ్చినట్టు ప్రకటించగా.. మరో ఎమ్మెల్యే తాజాగా కేటీఆర్‌తో భేటీ అయ్యారు.భద్రాచల్లం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. వీరు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, బీఆర్ఎస్ ఘర్‌వాపసీ ఆపరేషన్ ప్రారంభించిందని, త్వరలోనే ఈ నలుగురు బీఆర్ఎస్…
