Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 7 March 2024, 7:23 pmEditor : SIRA NEWS

Gajula Rakesh: మ‌రోసారి ప్రధాని నరేంద్రమోదీని చేద్దాం..

సిరా న్యూస్, బజార్ హ‌త్నూర్
మ‌రోసారి ప్రధాని నరేంద్రమోదీని చేద్దాం..
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి అభ్యర్థిని గెలిపించాలి
* యువమోర్చా సోషల్ మీడియా బోథ్ అసెంబ్లీ కన్వీనర్ గాజుల రాకేష్
ప్రధాని నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిగా ఎన్నుకునేందుకు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో జనమంతా మోదీకే జై కొడుతున్నారని యువమోర్చా సోషల్ మీడియా బోథ్ అసెంబ్లీ కన్వీనర్ గాజుల రాకేష్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దేగామ గ్రామంలో లాబర్థి సంపర్క్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంత‌రం కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన గ్యాస్ కనెక్షన్, పీఎం కిసాన్ యోజన, ఉచిత రేషన్, మాతృ వందన యోజన, ఉపాధి హామీ పథకం, ఫసల్ భీమా యోజన, లేబర్ ఇన్సూరెన్స్, ఈ శ్రామ్ యోజన, ఉచిత విద్యుత్ కనెక్షన్, ఉచిత వ్యాక్సిన్, అయుష్మాన్ భారత్, పీఎం స్వానిధి, స్వచ్ భారత్ మిషన్ ( మరుగు దొడ్లు), మహిళ సమ్మాన్ నిధి, లక్ పత్ దీదీ, పీఎం పోషన్ శక్తి నిర్మాణ అభియాన్, అగ్నిపత్ పథకం, పీఎం మత్స్య సంపద యోజన, ముద్ర యోజన, అటల్ పెన్షన్ యోజన, సురక్ష భీమా యోజన, సుకన్య సమృద్ది యోజన, జన్ ఔషది మందులు, దిన్ దయాళ్ అంత్యోదయ యోజన, జన్ దన్ యోజన, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, పీఎం స్వస్త సురక్ష యోజన,గ్రామీణ సడక్ యోజన, అంత్యోదయ అన్న యోజన, ఎరువుల సబ్సిడీ వంటి పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను సేకరించారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయని, అన్ని రంగాలలో దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నామని, ఇప్పుడు భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ లోక్ సభ ఎన్నికలలో తిరిగి ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్నుకోవాలని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పనితనం అద్భుతంగా ఉందని, కేంద్ర పథకాలలో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ది పొందుతున్నామని ఈ పార్లమెంట్ ఎన్నికలలో తిరిగి నరేంద్ర మోదీని బలపరచి భారీ మెజారిటీ తో బిజెపి ని గెలిపిస్తామని లబ్దిదారులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.