
పోటీకి నో అంటున్న గల్లా
సిరా న్యూస్,గుంటూరు; పాతూరి రాజగోపాల నాయుడు ఫ్రీడయ్ ఫైటర్, రాజకీయవేత్త, కిసాన్ లీడర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈయన రాజకీయ గురువు. ఈయన కుమార్తె గల్లా అరుణకుమారి తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అరుణ కుమారి భర్త గల్లా రామచంద్రనాయుడు.. అమరరాజా పేరుతో బ్యాటరీ కంపెనీ స్థాపించి చిత్తూరు స్థానికులకు వేలసంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించిన పారిశ్రామికవేత్త. వీరి కుమారుడు గల్లా జయదేవ్ 2014, 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. రాజకీయంగా మొదటి నుంచి ఘన చరిత్ర ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. గల్లా అరుణ కుమారి కుమారుడు జయదేవ్…పారిశ్రామిక వేత్త,…
