
గ్యాస్ భారం… నెలకు 77 కోట్లే
సిరా న్యూస్,హైదరాబాద్; రాష్ట్ర ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి ఈ నెల 27న జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా తేల్చింది. ఈ పథకానికి తొలుత 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరింత తగ్గవచ్చని అధికార వర్గాల సమాచారం. అర్హులైన వారిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్ సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని…
