
Gas price : గ్యాస్ ధర చెల్లించాల్సిందే…
తర్వాత అకౌంట్ కు క్యాష్ బదిలీ సిరా న్యూస్,హైదరాబాద్; మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ‘మహాలక్ష్మీ’ పథకంలో భాగంగా ఈ నెల 27వ తేదీన రూ. 500కే గ్యాస్ సిలిండర్ను ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. ఈ స్కీంలోకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న లబ్దిదారులను కూడా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు ఇచ్చింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు తొలుత పూర్తి ధర చెల్లించాల్సిందేనని.. ఆ తర్వాత రూ. 500 నగదు రీయింబర్స్ రూపంలో లబ్ధిదారుల అకౌంట్లలోకి బదిలీ చేస్తామని తెలిపింది. హైదరాబాద్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 కాగా.. ఇందులో వినియోగదారుడు చెల్లించాల్సింది రూ.500, కేంద్ర రాయితీ రూ. 40 పోనూ, మిగతా రూ.…
