Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 13 September 2024, 6:36 pmEditor : Sira News

వైభవంగా గణేషుడి శోభా యాత్ర

సిరా న్యూస్,హిందూపురం;
హిందూపురంలో శుక్రవారం గణేష్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. – హిందూపురం మున్సిపల్ పరిధిలో 180 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసారు. – ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో 2 ఏఎస్ పిలు, 4 డిఎస్పీలు, 30 మంది సీఐలు, 12 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయిన ఈ శోభాయాత్ర పట్టణ వీధుల్లో వివిధ ఆకృతుల్లో తయారుచేసిన గణనాథులను అంబేద్కర్ సర్కిల్ మీదుగా గురునాథ సర్కిల్, రహమత్పూర్ సర్కిల్ చేరుకొని గుడ్డం రంగనాథ స్వామి ఆలయ కోనేరులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.