Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 22 January 2024, 5:59 pmEditor : Sira News
God Ramudu: ప్రాణప్రతిష్ట సందర్భంగా పూజలు

ఖానాపూర్, సిరా న్యూస్
ప్రాణప్రతిష్ట సందర్భంగా పూజలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలను జరిపిన తర్వాత అన్నదానం, ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ దేవదాయ కమిటీ, సర్పంచ్ సిర్ల లక్ష్మి, ఉప సర్పంచ్ అల్లి భూమక్క గ్రామస్తులు దామెర బక్కన్న, సీర్ల విజయ్, శ్రీనివాస్, అల్లి రాజ, మల్లయ్య, అడపా రాకేష్, గుమ్ముల రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.
