Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 23 March 2024, 8:47 pmEditor : SIRA NEWS

Goka Ganesh Reddy: చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ని సన్మానించిన గోక గణేష్ రెడ్డి

సిరా న్యూస్, బోథ్:

చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ని సన్మానించిన గోక గణేష్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు. శనివారం అదిలాబాద్ పట్టణంలోని గణేష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వారిరువురు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అదిలాబాద్ జిల్లా తాజా రాజకీయ పరిస్థితుల గురించి కాసేపు చర్చించారు. అనంతరం గోక గణేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డిని శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని, జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చంటి పసుల, కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్, పోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.