
Goush alam: పకడ్బందీగా చెక్ పోస్ట్ నిర్వహణ : ఎస్పీ గౌష్ ఆలం
సిరాన్యూస్,ఆదిలాబాద్ పకడ్బందీగా చెక్ పోస్ట్ నిర్వహణ : ఎస్పీ గౌష్ ఆలం * మూడు చెక్ పోస్టులను తనిఖీ * మద్యం, డబ్బు, గంజాయి రవాణాకు అడ్డుకట్ట పకడ్బందీగా చెక్ పోస్ట్ నిర్వహణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు.మహారాష్ట్రలో శుక్రవారం ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్న మూడు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది విధులను పరిశీలించారు. మొదటగా జైనథ్ మండలం పిప్పర్ వాడ చెక్పోస్ట్ ను చేరుకొని అక్కడ నుండి ఆదిలాబాద్ కు వస్తున్న వాహనాలను , ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్లే వాహనాలను పరిశీలించారు. ప్రజలెవరు 50వేల కన్నా ఎక్కువ నగదును తీసుకొని వస్తే దానికి సంబంధిత రసీదులను కలిగి ఉండాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న నగదు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ…
