తాజా వార్తలు

Goush Alam: జిల్లాలో మాదకద్రవ్యాల రూపుమాపడ‌మే లక్ష్యం: జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్, ఆదిలాబాద్‌ జిల్లాలో మాదకద్రవ్యాల రూపుమాపడ‌మే లక్ష్యం: జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పట్టణంలో ముమ్మర తనిఖీలు * మాదకద్రవ్యాలపై ప్రత్యేక ఆపరేషన్ * మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న చెక్ పోస్ట్ ల తనిఖీ జిల్లాలో మాదకద్రవ్యాల సంపూర్ణ రూపుమాపడ‌మే లక్ష్యమ‌ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. శ‌నివారం ఉదయం రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి మద్యం, గంజాయి, డబ్బు అక్రమంగా తరలించకూడదనే ఉద్దేశంతో ఆకస్మికంగా ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో మాదకద్రవ్యాలను సంపూర్ణంగా రూపుమాపాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ సిబ్బందితో మాదకద్రవ్యాలను గుర్తించే విధంగా తనిఖీలను నిర్వహించడం జ‌రుగుతుంద‌ని తెలిపారు. తనిఖీలలో భాగంగా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలు,…

Read More
26 Apr 2024, 3:26 pmsiranews.in