
Goush alam: యోగాతో మానసిక ప్రశాంతత: ఎస్పీ గౌష్ ఆలం
సిరాన్యూస్, ఆదిలాబాద్ యోగాతో మానసిక ప్రశాంతత: ఎస్పీ గౌష్ ఆలం * పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు * జిల్లా వ్యాప్తంగా పోలీసు కార్యాలయాల్లో యోగా నిర్వహణ ప్రతీ రోజు యోగా చేయడం వలన అనారోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. శుక్రవారం ప్రపంచ పదవ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటుచేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ పాల్గొని సిబ్బందితో కలిసి యోగా నిర్వహించారు. మొదటగా యోగా శిక్షకుడు కానిస్టేబుల్ సామ రాజు యోగ ను సిబ్బందికి తెలియజేస్తూ, సూర్య నమ స్కారాలు, ప్రాణాయామము, ఆసనములు సిబ్బంది ద్వారా చేయించారు.యోగా దినోత్సవం లో భాగంగా జిల్లా…
