
Goush alam: పోలీసు వ్యవస్థకు అందించిన సేవలు మరువలేనివి: ఎస్పీ గౌష్ ఆలం
సిరాన్యూస్, ఆదిలాబాద్ పోలీసు వ్యవస్థకు అందించిన సేవలు మరువలేనివి: ఎస్పీ గౌష్ ఆలం పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ఆడే ఉత్తమ్ * కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలి పోలీసు వ్యవస్థకు అందించిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. పోలీస్ శాఖ సుదీర్ఘకాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ ఆడే ఉత్తమ్ పదవీ విరమణ కార్యక్రమం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సమక్షంలో నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవించాలని తెలియజేశారు. సిబ్బంది పోలీసు వ్యవస్థకు నిర్విరామంగా అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు. 1990 సంవత్సరంలో పోలీసు వ్యవస్థలోకి కానిస్టేబుల్ గా అడుగుపెట్టి ఉమ్మడి…
