
Goush alam: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణనే లక్ష్యం
సిరా న్యూస్, ఆదిలాబాద్ * ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణనే లక్ష్యం * భద్రతాభావం పెంపొందించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ * పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండ ఫ్లాగ్ మార్చ్ * జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాలు, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లాగ్ మార్చ్ ను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ లో ప్రజల నందు భద్రతాభావం పెంపొందించేకే నిర్వహించబడతాయని, ప్రజలు ఎటువంటి భయాందోళనకు లోనవ్వకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని…
