
ప్రభుత్వ పరిహారం.. బ్యాంకుల పాలు
సిరా న్యూస్,విజయవాడ; బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటిస్తే అది కాస్త బ్యాంకుల పాలవుతోంది. గత రెండ్రోజులుగా ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డుతో లింకైన బ్యాంకు ఖాతాలకు పరిహారాన్ని చెల్లిస్తోంది. ఈ క్రమంలో కొందరు వరద బాధితుల పరిహారాన్ని బ్యాంకులు తమ పాత బాకీల్లో జమ చేసుకుంటున్నాయి. మైనస్ అకౌంట్లలోఉన్న నగదును బ్యాంకులు మళ్లించుకుంటుండంతో బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వరద బాధితుల నష్టం గణించినపుడు ఇచ్చిన బ్యాంకు అకౌంట్ ఒకటైతే ఆ ఇంట్లో ఎవరి అకౌంట్లో మైనస్ ఖాతా ఉంటే ఆ ఖాతాలకు నగదు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో బాధితులు లబోదిబోమంటున్నారు. కుటుంబంలో డిబిటి మ్యాపింగ్ ఉన్న ఖాతాలకు పరిహారం జమ చేస్తున్నట్టు బ్యాంకులు చెబుతున్నాయి. కొందరికి ఇనాక్టివ్ ఖాతాలు, ఆధార్ కేవైసీ కానీ ఖాతాలకు…
