
సకల కళలకు ప్రభుత్వ ప్రోత్సాహం
సిరా న్యూస్,హైదరాబాద్; నపద కళలకు, సంప్రదాయాలకు తెలంగాణ పెట్టని కోట అనీ, తెలంగాణ సమాజంలోనే కళాకారులను గౌరవించే తత్వం ఉందనీ, తెలంగాణ ప్రజలు అనాది జీవన కళలను నిరంతరం కాపాడుకుంటూ వస్తున్నారని ఎక్సైజ్ ప్రోహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలోని ఆశ్రిత కులాలలో అత్యున్నత కళా ప్రతిభ, సాంస్కృతిక విశిష్టత దాగి ఉందని, అలాంటి కళాకారులలో వైష్ణవతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మిత అయ్యల్ వార్లు ఒకరని ఆయన అన్నారు. డా. ఆవాల వీణ రచనలో భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘మిత అయ్యల్ వార్లు’ పుస్తకాన్ని ఈ రోజు సెక్రెటేరియట్ లో ఆవిష్కరించిన ఆయన, భవిష్యత్ లో అన్ని రకాల ఆశ్రిత కులాల కళారూపాలు, జానపద కళలకు సంబంధించిన విశేషాలను సేకరించి ప్రచురిస్తామని అన్నారు. తెలంగాణలో ఉన్న సమస్త…
