
బస్సుల్లో పెరిగారు.. మెట్రోలో తగ్గారు
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైద్రాబాద్లో ఎక్కువగా స్టూడెంట్స్, ఉద్యోగస్తులతో ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసినంత రద్దీ కనిపిస్తోంది. ఇక ఆర్టీసీల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో, ఆ ఎఫెక్ట్ కొంత మెట్రో రైళ్లపై కనిపిస్తోంది. లాంగ్ జర్నీ చేసే వాళ్లు తప్పా, ఎక్కువ మంది ఆర్టీసీ ఫ్రీ సర్వీస్లను వాడుకుంటున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు లేడీస్ తో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన రూట్లలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రష్ కనిపిస్తోంది. షాపింగ్ ఏరియాలు, గుళ్లు, టూరిజం స్పాట్లు, హాస్పిటల్స్, ఆఫీస్ రూట్లలో వెళ్లే బస్సుల్లో లేడీస్ రద్దీ ఉంటోంది. ఫ్రీ స్కీమ్ అమలైనప్పటి నుండి బస్సుల్లో సీట్లు దొరకడంలేదంటున్నారు ప్రయాణికులు. ప్రధాన ఏరియాలను కలుపుతూ వెళ్లే బస్సులన్నీ మహిళా…
