తాజా వార్తలు

పెరగనున్న గ్రూప్ వన్ పోస్టులు

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో గ్రూప్–1 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 70కి పైగా పోస్టులను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 600 వరకూ ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు మరో 130 పోస్టులు ఖాళీ అవుతాయని అధికారులు తేల్చారు. ఇప్పటికే ఆయా శాఖలు ఖాళీల వివరాలను ఆర్థికశాఖకు సమర్పించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా? త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా? అనే అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో గుర్తించిన 503 గ్రూప్ –1 పోస్టులకు అదనంగా ఇంకా ఏమైన ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న…

Read More
5 Feb 2024, 3:18 pmsiranews.in