
చేగువేరా నుంచి సనాతనధర్మం పరిరక్షకుడు…
పవన్ ట్రాన్స్ ఫార్మేషన్ ఇలా... సిరా న్యూస్,గుంటూరు; పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక చేగువేరా. తనలోని ఒక చేగువేరా ఒక కమ్యూనిస్టు,ఒక బహుజన సానుభూతిపరుడు ఉన్నాడని జన సైనికులు భావించేవారు.పవన్ చర్యలు కూడా అలానే ఉండేది.ఆయన నటించిన సినిమాల్లో సైతం కమ్యూనిస్టు భావజాలాన్ని చూపించేవారు.తాను సినిమాల్లోకి రాక పోయి ఉంటే అడవుల్లో అన్న అయి ఉండేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు పవన్. అంతలా పెనవేసుకుపోయింది కమ్యూనిజంతో ఆయన బంధం.అయితే ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణకు అంటూ పవన్ కళ్యాణ్ కొత్త పంధాను ఎంచుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు కమ్యూనిస్టుగా ఉన్న పవన్ ఆధ్యాత్మిక వేత్తగా ఎందుకు మారారు? సమాజ అవసరం కోసం మారారా? లేకుంటే రాజకీయ ప్రయోజనాల కోసం మారారా? అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే బిజెపితో జతకట్టి మత రాజకీయాలు చేస్తున్నారని…
