తాజా వార్తలు

Guda: గూడలో ఘ‌నంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

సిరాన్యూస్‌, జైన‌థ్‌ గూడలో ఘ‌నంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథ‌మ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుంచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. అనంత‌రం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More
18 May 2024, 3:36 pmsiranews.in