
గురుకులాలు… సమస్యలకు ఆవాసాలు
8 నెలల్లో 36 మందిమృతి సిరా న్యూస్,కరీంనగర్; తెలంగాణ గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మాారాయి. 8 నెలల్లో 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, 500లకు పైగా మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం సంక్షేమ హాస్టళ్ళ అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతుంది. పెద్దాపుర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. సరస్వతి నిలయాలు సమస్యలతో సతమతమవుతున్న సంక్షేమ హాస్టళ్ళపై స్పెషల్ రిపోర్ట్. చదువులమ్మ ఒడి సర్కార్ బడి...ఆ బడిలో చదివే పేద పిల్లలకు వసతి కల్పించే సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం... అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తుంది. ఇక్కడ అక్కడ అనే తేడాలేదు.. 8 మాసాల్లో తెలంగాణ వ్యాప్తంగా 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు విద్యార్థులు జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల…
