Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 26 April 2024, 3:19 pmEditor : Sira News

అమరవీరుల హంతకుడు హరీష్ రావు

 సిరా న్యూస్,హైదరాబాద్;
గన్ పార్క్ వద్ద ఎమ్మెల్సీ.. బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడారు. అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను,యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు. అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడం తో ఈ ప్రాంతం మైల పడింది. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. 10 ఏళ్లుగా హరీష్ రావు కి బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరుల గుర్తుకు రాలేదు. హరీష్ రావు టిఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమే. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారు. హరీష్ రావు రాజీనామా లేక వృధా కానివ్వను. ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు.
శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన నువ్వు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా. *కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు అడుతున్నావు. ఆగస్ట్ 15 వ తేదీ లోగా 2లక్షల రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన్నట్లు బీఆర్ఎస్ రద్దు చేస్తారో లేదో కేసీఆర్ ని చెప్పామనండి. హరీష్ రావు, ఆగస్ట్ 15 తర్వాత మీ రాజీనామా ఆమోదం చెందేలా ఎమ్మెల్సీ గా నేను బాధ్యత తీసుకుంటాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగల వచ్చి వెళ్ళడం కాదు. పదేళ్లలో మీరు ఏం చేశారో చెప్పండి రండి ఎమ్మెల్సీ గా నేను మీకు సవాల్ విసురుతున్నానని అన్నారు. ..
================================

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.