
షెల్జా చుట్టూ హర్యానా రాజకీయం
సిరా న్యూస్,ఛండీఘడ్; హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కుమారి సెల్జా దూరం పాటించడంతో రాజకీయాలు వేడెక్కాయి. సెల్జాను బుజ్జగించాల్సిన కాంగ్రెస్ హైకమాండ్ సైతం మౌనం పాటిస్తుండగా.. రాష్ట్ర అగ్రనేత, మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా కూడా ఆమెను పూర్తిగా విస్మరించారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సహా వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బీజేపీ నేత, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రమే కాదు, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీఎస్పీ సమన్వయకర్త ఆకాష్ ఆనంద్ కాంగ్రెస్ నేత కుమారి సెల్జాతో మంతనాలు సాగిస్తున్నారు. తమ పార్టీలో చేరాలంటూ ఎవరికి వారు ఆమెకు ఆహ్వానాలు పంపుతున్నారు. సెల్జాకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ బీఎస్పీ, బీజేపీ ఎన్నికల ఎజెండాను సెట్ చేయడం ప్రారంభించాయి. దీంతో…
