
బీజేపీ ప్లాన్ స్టార్ట్ అయిందా..?
సిరా న్యూస్,వరంగల్; తెలంగాణలో ఏం జరుగుతోంది... అందులో బీఆర్ఎస్ - బీజేపీ మధ్య ఏం జరుగుతోంది.? శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్ లో కాలు పెట్టగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మోదీ సభ నిర్వహిస్తే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచే కాక ఏకంగా పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేశారు. ఈ రెండు పరిణామాలకు కారణం బీజేపీయేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా అటు బీఆర్ఎస్ నేతలు కవిత అరెస్టుకు కారణం బీజేపీనే అని ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తును విచ్ఛిన్నం చేసే కుట్రకు బీజేపీ తెర లేపిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈ…
