
తెలంగాణలో హృదయ విదారకం – లారీ ఢీకొని గర్భిణీ మృతి
సిరా న్యూస్,మెదక్; తెలంగాణలో బుధవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణీని లారీ ఢీకొని మృతి చెందగా.. గర్భస్థ శిశువు దాదాపు 10 మీటర్ల దూరంలో ఎగిరిపడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన పనేటీ రేణ (29) ఏడు నెలల గర్భిణీ. ఆమె బుధవారం ఓ వ్యక్తితో కలిసి బైక్పై తూప్రాన్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మనోహరాబాద్ వద్ద జాతీయ రహదారిపై బైక్ యూటర్న్ తీసుకుంటుండగా.. ఓ లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో గర్భస్థ శిశువు తల్లి పేగు తెంచుకుని బయటకు వచ్చి 10 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై…
