
అటు పార్టీ.. ఇటు పాలన
సిరా న్యూస్,విజయవాడ; ఒకవైపు పార్టీలో ప్రక్షాళన.. మరోవైపు.. పాలనపై ఫోకస్.. ఇదీ.. ఇప్పుడు.. సీఎం జగన్ ఫాలో అవుతున్న రూల్.. అవును.. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో సీఎం జగన్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నారు. ఎన్నికలకు రెడీ అవుతూనే.. పాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే.. పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్.. వచ్చే రెండు నెలల ప్రభుత్వ కార్యక్రమాలకూ షెడ్యూల్ ఫిక్స్ చేసేశారు.తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఏపీ రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి తగ్గట్లే.. సీఎం జగన్ వ్యూహాలకు వేగంగా పదును పెడుతున్నారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందనే ప్రచారం జరిగింది. కొత్త అభ్యర్థులను నిలిపిన చోట బీఆర్ఎస్‌కు సానుకూల ఫలితాలు రావడమే అందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే.. సీఎం…
