
హైదరాబాద్ లో అత్యధికం… పెద్దపల్లిలో అత్యల్పం
సిరా న్యూస్,హైదరాబాద్; టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. గత ప్రభుత్వంలో 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయగా… కొత్తగా ఈ నోటిఫికేషన్ ను ప్రకటించింది.మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా, పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్…
