Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 24 September 2024, 6:57 pmEditor : Sira News

హిందూవులకు ఇతర మతాల పై ద్వేషం వుండదు

ప్రకాష్ రాజ్ హిందూ దేవుళ్లపై జోకులేస్తున్నాడు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సిరా న్యూస్,విజయవాడ;
సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాయశ్చిత్త దీక్షకు ఇవాళ మూడోరోజు. మేము రామభక్తులం.. ఆంజనేయస్వామిని పూజిస్తాం. కనకదుర్గమ్మ రధం, సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేసారు. సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలీదు. జగన్ ను నేను ఎత్తి చూపడం లేదు… మీ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలి. రాజ్యాంగం బాగుండాలి అని పాటుపడుతున్నాం మేము. సెక్యులరిజం అన్ని వైపుల నుంచీ రావాలి. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం. మసీదులో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా.. హిందువుల పట్ల ఎలా మాట్లాడతారు. పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు… తమాషాలుగా ఉందా.. సరదాలుగా ఉన్నాయా.. అపవిత్రం జరిగిందని మాట్లాడాను.. మాట్లాడకూడదా. ప్రకాష్ రాజ్ కూడా చెపుతున్నా… సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది.. కానీ ఆయన సరిగా మాట్లాడాలి. సనాతన ధర్మం పై దాడి జరిగినపుడు మాట్లాడకూడదా. ప్రకాష్ రాజ్ గారూ.. మేం చాలా బాధపడ్డాము.. మీకు ఇదంతా హాస్యం కావచ్చు, మాకు ఇదంతా చాలా బాధ. ఇష్టానికి సనాతన ధర్మం పై మాట్లాడుతున్నారని అన్నారు. మీరు సరస్వతీ దేవి, దుర్గాదేవి లపై జోకులు వేస్తారా.
సనాతనధర్మ రక్షణ అనేది గుడికెళ్ళే ప్రతీ హిందువు బాధ్యత కాదా. మదమెక్కి పొన్నవోలు మాట్లాడుతున్నారు. నామీద కోర్టులో కేసులేసుకోండి. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం పొన్నవోలుగారు. భూమన కరుణాకర రెడ్డిగారి నాశనం మొదలైంది. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కూడా విచారణకు రావాలి. టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి మాయమైపోయారు. ధర్మారెడ్డి హిందువా.. బిడ్డ చనిపోయిన పడకొండు రోజుల్లోపు గుడికి వస్తారా. ఇస్లాం, ముస్లిం లకు జరిగితే ఇలాగే ఉంటారా. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తే.. చనిపోవడానికి సిద్ధం నేను. మీ ప్రభుత్వాన్ని పడకొట్టిన ప్రజలు.. ఏమీ చేయలేరు అనుకుంటున్నారా. మీ మౌనంతో తరాలు నాశనం అయిపోతాయి. భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా. ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్ల మీదకు వచ్చి కొడతారని మీకు భయం. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఉండాలి… మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడాలని అన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.