
హెచ్ఎండీఏ అనకొండ శివబాలకృష్ణ అరెస్టు
సిరా న్యూస్,హైదరాబాద్; హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్గా, రేరా కార్యదర్శిగా పని చేస్తున్న శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చూసిన జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి వందల కోట్లు ఆస్తులు సంపాదించారంటే ముక్కున వేలేసుకుంటున్నారు. బుధవారం ఆయన నివాసాల్లో దాడులు చేసిన ఏసీబీ అధికారులకు దిమ్మదిరికే ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వంద కోట్లకుపైగా ఆస్తులు వెలికి తీశారు. శివబాలకృష్ణ నివాశాల్లో సుమారు 14 బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఆయనకి ఉన్న ఇళ్లు, బంధువులు ఇళ్లల్లో కూడా సోదాలు జరిపారు. ప్రస్తుతం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం వంద కోట్లపై ఆస్తులు గురించారు. ఇంకా చాలా ఆస్తులు మదింపు చేయాల్సి ఉంది. బ్యాంకు లాకర్లు తెరవలేదని అంటున్నారు. అవి తెరిస్తే ఇంకా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు వెలుగులోకి వస్తాయో…
