తాజా వార్తలు

డీఎస్సీకి భారీగా దరఖాస్తులు

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన 'TG DSC - 2024' దరఖాస్తు ప్రక్రియ ముగిసింది జూన్20 సాయంత్రం నాటికి 3,02,798 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా.. ఇందులో 2.84 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.మరోవైపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 'అప్లికేషన్ ఎడిట్' ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 64,556 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సవరించుకున్నారు. టెట్ ఫలితాలు విడుదలకావడంతో.. అభ్యర్థులు తమ టెట్ మార్కుల వివరాలు నమోదుచేసుకోవడం, ఇతర వివరాలు మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.తెలంగాణలో…

Read More
21 Jun 2024, 2:12 pmsiranews.in