
తూతూ మంత్రంగా గ్రామాల్లో గ్రామ సింహాలు పెట్టివేత
సిరా న్యూస్,పరవాడ పరవాడ మండలంలో గ్రామంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండడంతో ఈ విషయంపై గ్రామ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అధికారులకు ఫిర్యాదులు వస్తుడడంతో ప్రభుత్వ ఉన్నతధికారుల సూచనలతో మండలంలో గ్రామాల్లో ఉన్నటువంటి కుక్కలని పట్టుకొనే కార్యక్రమం మొదలుపెట్టారు. గ్రామస్తులు సహకారంతో రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న విధి కుక్కల్ని విశాఖపట్నంలో గల మారికవలస వద్ద ఉన్న శునకముల కూ.ని. ఫ్యామిలీ ప్లానింగ్.(స్టెయిలైజేషన్) శాస్త్ర విభాగమునకు తరలించడం జరుగుతుంది.అయ్యితే ఇంత వరకు బాగానే ఉన్న కుక్కలని పట్టుకొనే విధానం పై ప్రజలు నుంచి విమర్శలు వస్తున్నాయి.గ్రామంలో ఏదో ఒక ప్రదేశంలో కుక్కలని పట్టి మిగతా ఏరియాలో పట్టకపోవడం కుక్కల సంచారం గ్రామ వీధిల్లో అలాగే కనిపిస్తూడడంతో గతంకీ ఇప్పటికి తేడా లేకపోవడంతో పంచాయతీ అధికారులు ప్రజా సమస్యలుపై చిద్ద శుద్ధితో పని…
