
Hyderabad: హైదరాబాద్ ఈ ఏరియాల్లో జోరుగా వ్యభిచారం
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ రాష్ట్ర రాజధాని.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో వ్యభిచారం కూడా విచ్చల విడిగా పెరుగుతోంది. వ్యభిచారం అనేది ఒకప్పుడు తప్పుగా భావించేవారు.. కానీ విశ్వనగరంలో అది ఇప్పుడు సర్వ సాధారణమ అయింది. వ్యభిచారం తప్పు కాదని విచ్చల విడిగా చేస్తున్నారు. ఇక అమ్మాయిలు, మహిళలు కూడా అవసరాల కోసం వ్యభిచారాన్ని ఒక సర్వీస్‌గా భావిస్తున్నారు. తద్వారా ఆదాయం పొందుతున్నారు. దీంతో నగరాల్లో రాత్రిపూట వ్యభిచారం పడగ విప్పుతోంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా వ్యభిచార ముఠాలు బహిరంగంగానే బిజినెస్ సాగిస్తున్నాయి. ఒకవైపు ఆన్‌లైన్‌లో హైటెక్ పద్ధతుల్లో.. ఇంకోవైపు మసాజ్, స్పా సెంటర్లు వ్యభిచార కేంద్రాలుగా మారుతున్నాయిఆన్‌లైన్‌లో కొన్ని ముఠాలు డబ్బు సంపాదనే లక్ష్యంగా అమ్మాయిల ఫొటోలు అప్‌లోడ్ చేసి విటులకు ఎరవేస్తున్నాయి. ఇక కొన్ని మసాజ్ కేంద్రాలు, స్పా సెంటర్లు.. ఏజెంట్లను…
