తాజా వార్తలు

హైడ్రా కన్నీటి గాధలు…

సిరా న్యూస్,హైదరాబాద్; రువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల రక్షణ కోసం హైడ్రా పని చేస్తుందని వార్తలు వచ్చినప్పుడు.. మంచిదే కదా అని అందరూ అనుకున్నారు. పెద్ద పెద్ద వ్యక్తుల నిర్మాణాలు కూల్చివేస్తుంటే.. కరెక్టే కదా అని చర్చించుకున్నారు. కానీ ఇప్పుడు ఎంతోమంది పేద, మధ్య తరగతి ప్రజలు కన్నీరు పెడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరం చైతన్యపురి మూసీ నది ఏరియాలో అధికారులు సర్వే చేపట్టి.. కూల్చివేయాల్సిన వాటికి మార్క్ చేస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు.'నా భార్య 9 నెలల కడుపుతో ఉంది. ఇప్పుడు ఉన్నపళంగా వచ్చి మా ఇల్లు కూల్చేస్తే.. మేము ఎక్కడికి పోవాలి' అని ఆవేదన వ్యక్తం చేస్తూ.. చైతన్యపురిలో పెట్రోల్ పోసుకొని ఒ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పట్టా భూమిలోనే ఇల్లు కట్టుకున్నాం.. కరెంట్ బిల్లు, ఇంటి పన్ను అన్ని కడుతున్నామని…

Read More
28 Sep 2024, 3:36 pmsiranews.in