
మాకో టిక్కెట్ కావాలి…
గాంధీభవన్ కు నేతల క్యూ సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకూ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఇన్‌చార్జీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలా బలాలను అంచనా వేస్తోంది. క్యాడర్‌ను సమాయత్తం చేస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దరఖాస్తుల విధానం విజయవంతం కావడంతో లోక్‌సభ ఎన్నికల కోసం కూడా అదే విధానం అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో పోటీ చేయాలనుకునేవారు రూ.50 వేలు చెల్లించి దరఖాస్తు అందించాలని సూచించారు.కాంగ్రెస్ లోక్‌సభ టికెట్ల కోసం తీసుకుంటున్న దరఖాస్తులకు భారీగా స్పందన వస్తోంది. నేతలు క్యూ కడుతున్నారు. ఇందులో ఇద్దరు తెలుగు సినీ నిర్మాతలు కూడా ఉండడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా…
