ఆంధ్రప్రదేశ్

షర్మిల వెంట వుంటాను

ఎమ్మెల్యే ఆర్కే సిరా న్యూస్,మంగళగిరి; నేను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుంది. వైసీపీకి నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసని మంగళగిరి ఎమ్మెల్యేరామకృష్ణారెడ్డి అన్నారు. నేను సర్వస్వం పోగొట్టుకున్నాను. నేను వైఎస్ షర్మిలా వెంట నడుస్తా. నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటాను. నేను షర్మిలను కలిశాను షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా అప్పుడు నా నిర్ణయం ఉంటుంది. వైసీపీకి సిద్దాంతాలు ఉండాలి. ఎంచుకున్న అభ్యర్థులను ఒడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలి. మంగళగిరి ప్రజలు అభివృద్ధినీ కోరుకుంటున్నారని అన్నారు. .1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించాను. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు.…

Read More
30 Dec 2023, 7:25 pmsiranews.in