
మార్చి 15న రిలీజ్ అవుతోన్న ‘వెయ్ దరువెయ్’ సినిమా సాయిరామ్ శంకర్‌కి పెద్ద మాస్ హిట్ కావాలని కోరుకుంటున్నాను –
సిరా న్యూస్ పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు...ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు త్రినాథరావు నక్కిన లాంచ్ చేశారు... ఎడిటర్ ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ నవీన్ రెడ్డిగారు ఈ సినిమా కోసం ముందుగానే పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు. అందుకనే నాకు ఎక్కువ పని పడలేదు. ఎక్కడా లెంగ్త్ ఎక్కువ కాకుండా, రీషూట్స్ వంటివి చేయకుండా అన్నీ ప్రణాళిక ప్రకారం చేసుకున్నారు. అదే ఈ సినిమాకు…
