తాజా వార్తలు

Idol installation in Ayodhya Ram Temple should be stopped : అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిలిపివేయాలి

అలహాబాద్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం సిరా న్యూస్,అలహాబాద్‌ ; అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్య లేవనెత్తిన అభ్యంతరాలను పేర్కొంటూ పిటిషన్‌లో ప్రస్తావించారు. కార్యక్రమం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుందని దుయ్యబట్టారు.ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనున్న విషయాన్ని కోర్టు ఎదుట పిటిషన్‌లో ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారని.. యూపీ సీఎం యోగి…

Read More
17 Jan 2024, 7:41 pmsiranews.in