
ప్రజలను విస్మరిస్తే పతనం తప్పదు…
సిరా న్యూస్,హైదరాబాద్; పాలితులతో పాలకులు ఎంతగా మమేకమైతే అంతగా ఆదరణ ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలు అలాంటి పాలకులను గుండెల్లో చిరకాలం చిరస్మరణీయంగా ఉంచుకుంటారు. చరిత్ర పుటల్లో కూడా వారి పేరు చెక్కుచెదరకుండా ఉంటుంది. కాని పాలకులు, పాలితులకు దూరమైతే ఎలా ఉంటుందో, పాలకులకు పాలితులకు మధ్య అధికారులు సైంధవుల్లా రాజ్యాంగేతర శ క్తుల్లా మారి అధికారం చెలాయిస్తే ఎలా ఉంటుందో ఇటీవల మూడు ప్రభుత్వాల పతనాలు నిరూపించాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సిపి అధినేత జగన్ రెడ్డి పతనం వెనుక అధికారులే కీలక పాత్ర వహించారని, వారు సిఎంఒ కార్యాలయంలో రాజ్యాంగేతర శక్తులుగా మారి మంత్రులు, ఎంఎల్ఎలకు, ప్రజలకు సిఎంను దూరం చేశారని దాని ఫలితమే జగన్ ఓటమి అంటూ ఆ పార్టీకి చెందిన మాజీ ఎంఎల్ఎ జక్కంపూడి రాజా సంచలనంగా వ్యాఖ్యానించారు.సిఎం…
