
ఇసుక ఫ్రీ అయితే… కానీ కండిషన్స్ పై క్లారిటీ
సిరా న్యూస్,విజయవాడ; ఏపీలో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 8నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అందుబాటులోకి రానుంది. అయితే ఇసుకను ప్రజలు ఎలా పొందాలనే దానిపై మాత్రం ఇంకా స్ఫష్టత రాలేదు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ధరలు చుక్కలనంటుతున్నాయి. యూనిట్ లేదా టన్ను ధర గరిష్టంగా రూ.10వేలు పలుకుతోంది. ధర చెల్లించడానికి సిద్ధమైనా గత నెల రోజులుగా మార్కెట్లో ఇసుక దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలనే నిర్ణయం తీపికబురే అయినా దాని ఫలితాలు ప్రజలకు ఏ మేరకు అందుతాయనేదే ప్రశ్నార్థకం. రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉంది. ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా నది పరివాహక ప్రాంతాల్లోని ఇసుకే రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఆధారంగా ఉంటోంది. గత…
