
శిశువుకు తల్లి పాలే శ్రీ రామ రక్ష
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ సిరా న్యూస్,పెద్దపల్లి; శిశువుకు తల్లి పాలే శ్రీరామ రక్ష అని, తల్లి పాల ప్రాముఖ్యత పై వారోత్సవాల కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో తల్లిపాల వారోత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాల ను జిల్లా సంక్షేమ శాఖ అధికారి వివరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తల్లిపాల వారోత్సవాలలోని ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన జిల్లాలో నిర్వహించాలని అదనపు…
