ఆంధ్రప్రదేశ్

60 మందికి సీట్లు గల్లంతే

సిరా న్యూస్,విజయవాడ; వచ్చే ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ లను జగన్ మార్చనున్నారా? ప్రజా వ్యతిరేకత కలిగిన ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ లేనట్టేనా? వారి స్థానంలో ప్రత్యామ్నాయ నాయకులకు అవకాశం కల్పించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను జగన్ గుణపాఠంగా తీసుకుంటున్నారు. అక్కడ సిట్టింగులను మార్చక పోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమి చవిచూసిందని తెలియడంతో అన్ని విధాలా జాగ్రత్త పడుతున్నారు.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత. దీనిని అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని విశ్వసించారు. కానీ ఆయన ఒకటి తలిస్తే.. ఏపీ ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. వైసీపీకి అంతులేని విజయం కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకే పరిమితం చేశారు. ఇప్పుడు తెలంగాణలో సైతం అదే సీన్ కనిపించింది.…

Read More
6 Dec 2023, 12:37 pmsiranews.in