Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 21 December 2023, 6:44 pmEditor : SIRA NEWS

IKP Gudihathnoor: చట్టాలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలి..

సిరా న్యూస్ గుడిహత్నూర్:

చట్టాలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలి..

మహిళలు వివిధ రకాల చట్టాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకొని లబ్ధి పొందాలని జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని చంద్రోదయ మహిళా సమాఖ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఇలా అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఎన్ని సమస్యలు ఎదురైన భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. బాలిక సంరక్షణ చట్టాలు, గృహహింస చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఇతరత్రా చట్టాల గురించి వివరించారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యత నిపుణుడు నిఖిల్ మాట్లాడుతూ ముద్రా యోజన, సుకన్య సమృద్ధి యోజన, పీఎం విశ్వకర్మ ఈ పథకాలను గురించి వివరించారు. కార్యక్రమంలో డిపిఎం సుగంధ, అధికారులు నీలా రాణి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.